BREAKING NEWS
This text is an example of text that can be
వరల్డ్ కప్ ముంగిట ఆడుతోన్న చివరి వన్డే సిరీస్‌లో భారత్ (Team India) శుభారంభం చేసింది. మొహాలీ వేదికగా జరిగిన మొదటి వన్డే (IND vs AUS) మ్యాచ్‌లో ఆసీస్‌పై టీమ్‌ఇండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత ఆస్ట్రేలియా సరిగ్గా 50 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 48.4 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన షమీ (5/51)కి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. రెండో వన్డే మ్యాచ్ ఆదివారం ఇందౌర్ వేదికగా జరగనుంది.