News card

Breaking News with CSS only
News Article Card: Telugu
Tuday.in
Breaking News
రాష్ట్రవ్యాప్తంగా 16.02.2024 ఆటోబంద్‌ నిర్వహించనున్నట్టు టీఏటీయూ ఆటో యూనియన్‌ అధ్యక్షుడు వేముల మారయ్య తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆటోడ్రైవర్లు జిల్లాల్లో ఎక్కడికక్కడ బంద్‌లో పాల్గొని నిరసన వ్యక్తం చేస్తారని తెలిపారు. హైదరాబాద్‌లో 16న ఉదయం 10 గంటలకు సుందరయ్య విజ్ఞానకేంద్రం నుంచి నారాయణగూడ చౌరస్తా వరకు భారీ ఆటో ర్యాలీ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఆటోడ్రైవర్లు అందరూ ఈ ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ర్యాలీని అడ్డుకోవాలని చూస్తే ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచితబస్సు పథకంలో ఆటోడ్రైవర్లు ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
Break:To